ప్రకాశం జిల్లాలో మృతి చెందిన కూలీలకు కూడా రూ.1 కోటి ఇవ్వాలి: కన్నా డిమాండ్

  • ఇటీవల ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం
  • మరణించిన కూలీలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా
  • ఆ పరిహారం సరిపోదన్న కన్నా
ఇటీవల విశాఖపట్నంలో ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ నుంచి విషవాయువు లీకై 12 మంది మృతి చెందగా, ప్రభుత్వం మృతులకు రూ.1 కోటి చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. అయితే, ఇటీవల ప్రకాశం జిల్లాలో వ్యవసాయ కూలీలు ట్రాక్టర్ ప్రమాదంలో మరణించగా, వారికి రూ.5 లక్షల చొప్పున పరిహారం అందించాలని నిర్ణయించారు.

దీనిపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అసంతృప్తి వ్యక్తం చేశారు. రైతు కూలీలకు ప్రభుత్వం ఇస్తున్న పరిహారం ఏమాత్రం చాలదని, గ్యాస్ లీక్ మృతులకు ఇచ్చినట్టే కూలీలకు కూడా రూ.1 కోటి చొప్పున ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని స్పష్టం చేశారు. వైజాగ్ గ్యాస్ లీక్ బాధితుల పట్ల చూపినంత ఉదార బుద్ధి ప్రకాశం జిల్లా ట్రాక్టర్ బాధితుల విషయంలో ఎందుకు చూపరని కన్నా ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన సీఎం జగన్ కు లేఖ రాశారు.

Kanna Lakshminarayana
Andhra Pradesh
YSRCP
Prakasam District
Road Accident
Vizag Gas Leak

More Telugu News